ప్రజాశక్తి-యర్రగొండపాలెం : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపిపి దొంతా కిరణ్ గౌడ్, వైసీపీ మండల కన్వీనర్ ఏకుల ముసలారెడ్డి తెలిపారు. శనివారం యర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులను, మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు. దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధిపత్యం, అణచివేతలు, ఆకలి, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు, అసమానతలు, సామాజిక, లింగ వివక్షత లేని నూతన సమాజ నిర్మాణం కావాలని చెప్పారు. సమానత్వం కోసం సాగిన సమరమే ఈ దినోత్సవం కాబట్టి ఆకాశంలో సగభాగమైన మహిళలు అవకాశాల్లో, అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. శ్రమలో పుట్టి, పెరుగుతున్న శ్రామిక నారీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచ్‌లు రామావత్ అరుణాబాయి, వాడాల పద్మ, ఏకుల జయమ్మ, పబ్బిశెట్టి సుభాషిణి, సర్పంచ్ కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు రాములు నాయక్, సింగా ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, గిరిబాబు, ఫజుల్, కొప్పర్తి ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
