ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మహిళలు ఆర్థికంగా ఎదగాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర అన్నారు. బుధవారం నాగులుప్పల పాడు వెలుగు కార్యాలయంలో గ్రామ సంఘం అసిస్టెం ట్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులో ఉన్న సభ్యు రాలు ప్రతి ఒక్కరు తీసుకునే లోన్‌లు వ్యక్తిగత అవసరా లకు కాకుండా చిన్న వ్యాపారాలుకు వినియోగించాల న్నారు. ప్రతి మహిళా ఒక వ్యాపార వేత్తగా తయారు కావాలని తెలిపారు. ప్రారంభించే యూనిట్లకు కనీసం ఒక లక్ష నుండి ఇరవై లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు పౌష్టికాహారం కోసం న్యూట్రి గార్డెన్‌లు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ ఎం.విజయమ్మ, ఏపీఎం బి.నరేంద్ర కుమార్, స్త్రీనిధి మేనేజర్ ఎం.శ్రీనివాస రావు, సీసీలు రామకష్ణ, రమణమ్మ, కవిత, అరుణ, అకౌంటెంట్ కోటేశ్వరి పాల్గొన్నారు.
