మహిళలు చైతన్యంతో ముందుకు సాగాలి

Sep 29,2024 21:56
ఫొటో : డిపాజిట్‌ నగదును అందజేస్తున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

ఫొటో : డిపాజిట్‌ నగదును అందజేస్తున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

మహిళలు చైతన్యంతో ముందుకు సాగాలి

ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : మహిళలు చైతన్యంతో ముందుకు సాగాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుచ్చి ప్రాంతీయ మండలాలు జిల్లా మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మహిళలు మరింత చైతన్యంతో ముందుకు వెళ్లాలని, ఉద్యమాలలో చురుకుగా పాల్గొనాలని మూఢనమ్మకాలను ఎదుర్కోవడంలో కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం 33శాతం ఉద్యోగాలు సాధించుకొని 50శాతం మహిళలు రాణిస్తున్నారని ఆమె తెలిపారు. జిల్లా కార్యదర్శి బి.సుభాషిణి మాట్లాడుతూ సమాజంలో మహిళలు ముందుకు ఎప్పుడు వెళ్తారో సమాజం అప్పుడు అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో అనాదిగా స్త్రీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. అనంతరం కొన్ని రోజుల క్రితం మండలంలోని రేబాల గ్రామంలో అమ్మవారితోపు పాఠశాల నాడు-నేడు పనుల్లో కరెంట్‌ షాక్‌ తగిలి మరణించిన కూలి భార్యకు యుటిఎఫ్‌ స్థానిక మండల శాఖ తరఫున రూ.72వేల నగదును వారి పిల్లల పేర్ల మీద ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసి అందించామన్నారు. కార్యక్రమంలో నవ కోటేశ్వరరావు, శ్రీదేవి, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.వి.శేషులు, జి వి చలపతి శర్మ, జిల్లా కార్యదర్శులు కె.నాగిరెడ్డి, కె.వి.శ్రావణ్‌ కుమార్‌, మరికొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, తదితరులు పాల్గొన్నారు.

➡️