మహిళల అభ్యున్నతే సమాజాభివృద్ధి

Jun 9,2024 00:02

కుట్టు శిక్షణను ప్రారంభిస్తున్న నూతి బాపయ్య చౌదరి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి – పెదనందిపాడు:
మహిళల స్వయం ఉపాధికి కుట్టు శిక్షణ దోహదపడుతుందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. మండల కేంద్రమైన పెదనందిపాడులోని తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) సహకారంతో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ రెండవ బ్యాచ్‌ను నాట్స్‌ మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరితో కలిసి కెఎస్‌ లక్ష్మణరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కన్వీనర్‌ డి.రమేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఎమ్మెలీ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్స్‌ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టిందని, బాపయ్య చౌదరి పెదనందిపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకసార్లు కంటి వైద్యశిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం బహుముఖ కార్యక్రమాల రూపకల్పన ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. బాపయ్య చౌదరి మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధి సాధించే విధంగా తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం ద్వారా కుట్టు శిక్షణను ఇవ్వటం హర్షణీయమన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన, గిరిజన, పేద, బలహీన వర్గాలకు వారు అభ్యున్నతి సాధించేలా నాట్స్‌ కార్యక్రమాల రూపకల్పన చేసినట్లు తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో మొదటి బ్యాచ్లో కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళల్లో 10 మందికి నాట్స్‌ ద్వారా కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో విజ్ఞాన కేంద్రం చేపట్టే కార్యక్రమాలకు నాట్స్‌ సహకారం ఉంటుందని చెప్పారు. మాజీ ఎంపీపీ ముద్దన నగరాజకుమారి మాట్లాడుతూ మహిళలు తమ స్వశక్తితో ఆదాయం పెంపొందించుకోవడానికి, తద్వారా కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు కుట్టు శిక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళలు అభ్యున్నతి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. రమేష్‌బాబు మాట్లాడుతూవిజ్ఞాన కేంద్రం ద్వారా బాలలకు వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించామని, దాతల సహకారంతో త్వరలో కంప్యూటర్‌ శిక్షణను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముద్దన రాఘవయ్య మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం చేపట్టే కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలను ఎప్పుడూ అందిస్తామని చెప్పారు., మొదటి బ్యాచ్లో కుట్టు శిక్షణ నేర్చుకున్న ఐదుగురికి ఉచితంగా ఎలక్ట్రికల్‌ మోటార్లను ఈ సందర్భంగా అందించారు. అనంతరం మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, దాసరి శేషగిరిరావు, అరవపల్లి కష్ణమూర్తి, కాపు శ్రీనివాస్‌, గేరా మోహన్‌రావు, శీలం అంకారావు మాట్లాడారు. అనంతరం స్థానిక పిఎఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గుర్రం వీరరాఘవయ్య భార్య, వివిఐటి కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఆళ్ల శ్రీవాణికి ‘రీసెర్చ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ వచ్చిన సందర్భంగా లక్ష్మణరావు, బాపయ్య చౌదరి, నగరాజకుమారి సత్కరించారు. మహిళలు వారిని ఆదర్శంగా తీసుకొని తమ రంగాల్లో విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ జంపని రామారావు, కో-కన్వీనర్‌ కొత్త వెంకటశివరావు, బాపయ్య చౌదరి తల్లిదండ్రులు నూతి సుబ్బారావు, నూతి సీతాదేవి, విజ్ఞాన కేంద్రం సభ్యులు కాపు వెంకట సుబ్బారావు, చుక్కా యానాదులు, ముద్దన వెంకటేశ్వర్లు, ఫణిదపు భువనేశ్వరి, బండి శంకరయ్య, నల్లమోతు రాజేంద్ర, బండి భోగేశ్వరరావు, కొల్లా సీతారామయ్య, లక్ష్మి పాల్గొన్నారు.

➡️