బోడపాటి రాజేశ్వరి కి ”వండర్‌ ఉమెన్‌” పురస్కారం

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి కి ” ”వండర్‌ ఉమెన్‌” పురస్కారం దక్కింది. హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ పీపుల్‌ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం విజయవాడ లో ఘనంగా నిర్వహించారు. నిత్యం సమాజంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల పట్ల నిత్యం పోరాడుతున్న నేపథ్యంలో బోడపాటి రాజేశ్వరి ని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా సంస్థ నేషనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ జ్ఞాన సుందరి, వైస్‌ చైర్మన్‌ వంగా ఆంజనేయులు చేతులు మీదుగా ”వండర్‌ ఉమెన్‌” పురస్కారాన్ని రాజేశ్వరి అందుకున్నారు. అలాగే హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ పీపుల్‌ తరపున బోడపాటి రాజేశ్వరి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండర్స్‌ నేషనల్‌ లీడర్స్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

➡️