నిర్వాసిత కాలనీ అభివృద్ధికి కృషి

Jun 9,2024 23:38 #bore well open
Bore well opened

ప్రజాశక్తి- గాజువాక : జివిఎంసి 75వ వార్డు పరిధిలో ఉన్న నిర్వాసిత కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి చెప్పారు. వార్డు పరిధి నెల్లిముక్కు, శీకువానిపాలెం, మొల్లివానిపాలెం, నీలాపు వీధి, దొమ్మేటి వీధులలో వేసిన బోర్లను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాసన సభ్యుల సహకారంతో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడానికి తన శక్తి మేరకు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, 75వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, దొమ్మేటి పెరుమాళ్లు, జనసేన అధ్యక్షులు కోన చిన అప్పారావు, బిజెపి అధ్యక్షులు గోందేసి గురప్ప, కూటమి నాయకులు శ్రీముసిరి శ్రీనివాసరావు, ములకలపల్లి పెంటయ్య, నంబారు పైడయ్య, నంబారు సింహాద్రి, పులి శ్రీరామరెడ్డి, నీలాపు అప్పలరెడ్డి, బస అప్పలరెడ్డి, బొంగు రాజు, కిల్లాన ముసలయ్య పాల్గొన్నారు.

➡️