ప్రజాశక్తి-పొదిలి: మర్రిపూడి మండలంలో మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఏపీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎల్.కోటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక స్త్రీ శక్తీ భవనం వెలుగు కార్యాల యంలో ఏపీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో మొత్తం 1022 గ్రూపులు, 30 గ్రామ సంఘాలు ఉన్నాయన్నారు. బ్యాంకు లింకేజీ టార్గెట్ రూ.25 కోట్లుకు గాను ఇప్పటివరకు రూ.15 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధంగా స్త్రీనిధి రూ.4 కోట్ల లక్ష్యం కాగా రూ.2 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందనిన్నారు. ఉన్నతి స్కీంలలో ఎస్‌సి, ఎస్‌టి, సబ్ ప్లాన్ ఎస్‌సి, ఎస్‌టిలోని గ్రూపు సభ్యులకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలలోని అన్ని గ్రూపులు ఏ- గ్రేడ్‌లో రావటటానికి అన్ని రుణాలు వందశాతం రికవరీ చేయటానికి కృషి చేస్తానని తెలియజేశారు.
