ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : మరుపల్లిలో ఎస్ ఎల్ డి పి ట్రైనింగ్ సెంటర్లో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మృతి చెందడానికీ కారణం రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడమే కారణమని ,మరణించిన ఉపాధ్యాయుడు కుటుంబానికి కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించాలని ఉపాద్యాయ సంఘాలు ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధనతో సంబంధం లేకుండా శిక్షణలు పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయడం వలన ఈ రోజు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మరణించారాన్నారు. గతంలో కూడా ఒక ఉపాధ్యాయుడు ఇదే విధంగా శిక్షణలో మరణించారు. రెసిడెన్షియల్ శిక్షణ సమయంతో సంబంధం లేకుండా శిక్షణ ఇవ్వడం వలన ఉపాద్యాయులు మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతుందని వారు ఆరోపించారు. గత ప్రభుత్వం విధానంగానే ఈ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు.
ఎస్ఎల్ డి పి ఎఫ్ ఎల్ ఎన్ ట్రైనింగ్లు రెసిడెన్షియల్ మోడల్ లో కాకుండా నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. శిక్షణ కేంద్రంలో మృతి చెందిన ప్రధానోపాధ్యాయులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలనీ, నాన్ రెసిడెన్షియల్ శిక్షణ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలనీ, బోధనకు ఆటంకం లేకుండా శిక్షణలన్నీ వేసవి సెలవుల్లో నిర్వహించాలనీ దియాండ్ చేశారు. ధర్నాలో ఉపాద్యాయ సంఘాలు ఐక్య వేదిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.