ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ … బుధవారం మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ ఆర్ బేబి శ్రీలక్ష్మి కి కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు డిఎస్ ఆర్ ప్రసాద్ డి.రామాంజనేయులు మాట్లాడుతూ … ప్రస్తుతం 13 రకాల సర్వే చేస్తున్నట్లు తెలిపారు సర్వేతోపాటు ఇంటి పన్ను కుళాయి పన్నులు వసూలు చేయటంలో కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇంకా 26 రకాల పనులు చేయాలని ఒత్తిడి చేయటం వలన విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు మానసికంగా శారీరకంగా అలసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎన్.నాగేంద్ర, మండల కార్యదర్శులు పాల్గొన్నారు.
కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించాలి : మండల పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్
