గ్రామాల్లో పనులు కల్పించాలి

Jan 23,2025 15:25 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనులు కల్పించి వలసలు అరికట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అదొనిలోని బావసార కళ్యాణ మండపం లో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమముకు సిపిఎం జిల్లా కార్యదర్సి గౌస్ దేశాయ్, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వీర శేఖర్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేషులు, డ్వామా ఏపీడీ లు లోకేశ్వర్,మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 6లక్షల మందికి పైగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు పోయారన్నారు. వారికి పనులు కల్పించడం లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు.అడిగిన కూలీలందరికీ పని కల్పించాలని  వారు డిమాండ్ చేశారు.

➡️