‘సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయండి’

ప్రజాశక్తి-రాయచోటి సమన్వయంతో జిల్లా యంత్రాంగమంతా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ బంగ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్నుల పండువగా అట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారులందరూ సమన్వయంతో విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంగా జిల్లాను అభివద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కషి చేయాలన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలోనే అభివద్ధిలో ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రతి అధికారి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రాబోయే రోజులలో అన్నమయ్య జిల్లాను మరింత అభివద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు. తేనేటి విందులో కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, రైల్వేకోడూర్‌ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ మెగా స్వరూప్‌, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ నౌదియా, రాయచోటి అర్‌డిఒ రంగా స్వామి, డిఆర్‌ఒ సత్యనారాయణ, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️