ప్రజాశక్తి-మర్రిపూడి : మండలంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 11 మంది కార్మికులు తమకు 5 నెలలుగా జీతాలు చెల్లించలేదని నిరసన తెలియజేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఐదు నెలల నుంచి కాంట్రాక్టర్ జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని వారు వాపోయారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సత్వరం జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ కాసిం పీరాలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అవుట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.