ప్రజాశక్తి – కడప అర్బన్ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి గోపి, నగర అధ్యక్షులు సుంకర రవి డిమాండ్ చేశారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని వైసిపి ప్రభుత్వం నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు. 9 మంది ఐఎఎస్‌లతో వేసిన కమిటీ ఆధారంగా వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగినా పట్టించు కోవడం లేదని పేర్కొన్నారు. గత్యంతరం లేక రోడ్డు ఎక్కాల్సి వచ్చందన్నారు. 16 రోజుల సమ్మె సందర్బంగా ప్రభుత్వం ఆర్థిక శాఖలో పెండింగ్ ఉన్న జీవోలను విడుదల చేయాలన్నారు. 13 వేల మంది ఇంజినీరింగ్ కార్మికులకు రూ.15000 వేల వేతనం ఇస్తున్నారని పేర్కొన్నారు. దాంట్లో పిఎఫ్, ఇఎస్‌ఐ కటింగ్ పోను రూ.13087 వస్తుందని తెలిపారు. ఈ వేతనంతో కుటుంబం బతకడం చాలా కష్టమవుందని చెప్పారు. జివో 36 ప్రకారం రూ .24,500 ఇవ్వాలని, లేని పక్షం అతి త్వరలో సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా సహాయ కార్యదర్శులు ఆనంద్ రావు, బ్రహ్మానంద రెడ్డి, మున్సిపల్ నగర అధ్యక్షులు సుంకర రవి, డ్రైవర్స్ నాయకులు సుంకర కిరణ్, పర్మినెంట్ నాయకులు కొండయ్య,మస్తాన్, మహిళా నాయకులు ధరణి, సిద్దయ్య, శ్యాం, సుబ్బయ్య, రామసుబ్బారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నారాయణ, బుజ్జి బాబు, లక్షుమయ్య, గోవర్ధన్, మురళి కష్ణ, హనుమంత్ రెడ్డి, ప్రసన్న కుమార్, రమేష్, పాలకొండరాయుడు, గోపాల్, శ్రీను, ప్రవీణ్, ప్రశాంత్, ప్రదీప్ కుమార్, రాంబాబు, రాజేష్, జగదీష్, కార్మికులు పాల్గొన్నారు.
