కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jun 10,2024 22:37

ప్రజాశక్తి- నాగులుప్పలపాడు : మధ్యాహ్నభోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.కల్పన డిమాండ్‌ చేశారు. నాగులుప్పలపాడు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల మండల సమావేశం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ పెరిగిన ధరల కనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. జీతం పెంచి యూనిఫాం, గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. వంటచేసేందుకు గ్యాస్‌ ఉచితంగా సరపరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు హనుమంతరావు, వెంకటేశ్వరమ్మ ,మాధవి ,జి. బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️