కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-చీమకుర్తి: మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐ టియు నాయకులు పూసపాటి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కానీ స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ చట్టబద్ధమైన సెల వులు, పనిముట్లు, రక్షణ పరికరాలు, డెత్‌, సిక్‌ పోస్టులలో వారి బిడ్డలకు ఉద్యోగాల కల్పన, సాధారణ ప్రమాదాలకు ఎక్స్‌గ్రేషియా లాంటి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్థానిక సమస్యలతో పాటు, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఏడుకొండలు, పి.పద్మ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️