గిద్దలూరు అభివృద్ధికి కృషి

ప్రజాశక్తి – గిద్దలూరు: గిద్దలూరును ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వ హించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో పచ్చద నానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం కావడంతో వీధుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు వీధులను పరిశుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణంలోని సగిలేరు వాగు పరివాహక ప్రాంత ప్రజల రక్షణకు రిటైనింగ్‌ వాల్‌ను అతి త్వరలోనే పూర్తి చేస్తామని, అదే విధంగా రాచర్ల రైల్వే గేట్‌ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్య తీర్చేందుకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిద్దలూరు పట్టణ అభివద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్‌ డి.వెంకట దాసు, పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్‌ మెంబర్స్‌, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️