ప్రజాశక్తి-శృంగవరపుకోట, లక్కవరపుకోట, విజయనగరంకోట : పాడి రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శృంగవరపుకోట, లక్కవరపుకోట మండలాల్లోని గోపాలపల్లి, ఎల్.కోట తలారి గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా నిర్మించిన మినీ గోకుల షెడ్లను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోకులాలను అవసరమైన వారికి మంజూరు చేసినట్లు తెలిపారు. లక్కవరపుకోట మండలంలో 38 గోకులాలు మంజూరైతే, 13 షెడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారదా దేవి, టిడిపి శృంగవరపుకోట, లక్కవరపుకోట మండలాల అధ్యక్షులు జి.ఎస్.నాయుడు, చొక్కాకుల మల్లునాయుడు, మాజీ జెడ్‌పిటిసి ఈశ్వరరావు, సర్పంచులు మహేష్, కోళ్ల భూపాల్‌నాయుడు, ఎపిఒ ఎం.విజయలక్ష్మి, మాజీ సర్పంచులు లగుడు ఎర్నాయుడు, గుమ్మడి ప్రసాద్, మాజీ ఎంపిటిసి రాముడు, నాయకులు డోకుల అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
గోకులాల డిజైన్ మార్చాలని వినతి
ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించబోయే గోకులాల షెడ్ల డిజైన్ మార్చాలని జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, పి.రవి.. డ్వామా పీడీ శారదా దేవికి వినతి పత్రాన్ని అందజేశారు. గోపాలపల్లిలో గోకులాల ప్రారంభోత్స వానికి హాజరైన పీడీని కలిసిని వినతి అందించారు. ప్రస్తుతం ఉన్న పశువుల షెడ్ల నిర్మాణం సౌకర్యవంతంగా లేదని తెలిపారు.
గుర్ల : అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం అచ్యుతాపురంలో మినీ గోకులాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.6 కోట్లతో తోటపల్లి కాలువ మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల చీపురుపల్లి నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు వెన్నె సన్యాసినాయుడు, తిరుమల రాజు కిరణ్ కుమార్, గొర్లి రామునాయుడు, మండల అప్పలనాయుడు, కనిమెరక కృష్ణ, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపిడిఒ శేషు బాబు, ఎపిఒ కామేశ్వరరావు పాల్గొన్నారు.
విజయనగరం కోట : విజయనగరం మండలం రాకోడులో రూ.2.30లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు గోశాలలను స్థానిక ఎంపిటిసి సభ్యులు వేచలపు శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని శుక్రవారం ప్రారంబించారు.అనంతరం కోరుకొండపాలెంలో 5, గుండాపేటలో 4 గోకులాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ డి. తిరుపతి నాయుడు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, ఎంపిటిసి పి. రాజేష్ బాబు, మాజీ ఎంపిపి కంది సాయి జగ్గారావు, మాజీ సర్పంచ్ జి. రామసత్యం, మాజీ ఉపసర్పంచ్ వి.రామసత్యం. పార్టీ నాయకులు జి. ప్రసాదరావు, చొప్ప రామారావు, గోశాల యాజమాని పొరిపి రెడ్డి రమణ పాల్గొన్నారు. అనంతరం కోరుకొండ, గుండాలపేట, కోరుకొండపాలెంలో పలు గోశాలలను ప్రారంభించారు.