ఇసుక సరఫరాతో పనులు కల్పించాలి

Oct 3,2024 00:02

ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఇసుక సరఫరా ద్వారా భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. స్థానిక జండా చెట్టు సెంటర్లో సిపిఎం 28వ వార్డు శాఖ మహాసభకు షేక్‌ సాయిబా అధ్యక్షతన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ బిజెపిని గద్దె దించే వరకూ సీతారాం ఏచూరి స్ఫూర్తితో పోరాడదామని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువులు ధరలను తగ్గించాలని, పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ పేదలకూ ఉపాధి హామీ కింద పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని గుంటూరు మాచర్ల ప్రధాన రహదారి మెయిన్‌ రోడ్డుకు మరమ్మతులు చేయించాలన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలను ఆమోదించారు. శాఖ కార్యదర్శిగా షేక్‌ సైదులును తిరిగి ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు జె.రాజ్‌కుమార్‌, షేక్‌ మస్తాన్‌బి, షేక్‌ ఆయెషా, వి.రామారావు, సైదాబీ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – నాదెండ్ల : సిపిఎం మండల మహాసభ సిహెచ్‌ అమరమ్మ అధ్యక్షతన మండల కేంద్రమైన నాదెండ్లలో బుధవారం జరిగింది. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, సీనియర్‌ నాయకులు ఎన్‌.కాళిదాసు మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయాలని, రైతులకు పెట్టుబడి సాయం రూ.20 సత్వరమే అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను మహాసభ ఆమోదించింది. రక్షితనీటి పథకం ద్వారా వచ్చే నీరు మురికిగా వస్తున్నాయని, ఫిల్టర్‌ బెడ్‌లను మార్చాలని, లింకురోడ్లు వేయాలని, కౌల్దార్లందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని తీర్మానాలు చేసింది. అనంతరం నూతన కార్యదర్శిగా దేవభక్తుని శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

➡️