అవంతిలో వర్క్‌షాప్‌

Jun 8,2024 23:37 #Avanthi Work shop
Avanthi Work shop

 ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో విశాఖ బిఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ”వైర్డు యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ఆప్టికల్‌ ఫైబర్‌ కమ్యునికేషన్‌)పై శనివారం వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ విశాఖ డిజిఎం డాక్టర్‌ ఎం.సత్యవరప్రసాద్‌ మాట్లాడుతూ, నైపుణ్యాభివృద్ధిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఎలా కీలక పాత్ర పోషిస్తున్నదీ, 5జి సాంకేతికతకు ఫైబర్‌ ఆప్టిక్‌ కమ్యునికేషన్‌ ఎలా ఉపయోగ పడుతుందో వివరించారు. వైర్డు యాక్సెస్‌ పరికరాలు పనిచేసే విధానాన్ని బిఎస్‌ఎన్‌ఎల్‌ నిపుణులు ఆచరణాత్మకంగా చూపించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.మురళీకృష్ణ, డైరెక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, ఇసిఇ విభాగాధిపతి వి.శివభాస్కరరావు మాట్లాడారు. వర్క్‌షాప్‌లో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️