‘సెయింట్‌ ఆన్స్‌’లో వర్క్‌షాపు

ప్రజాశక్తి-వేటపాలెం : ఇంటర్‌ నెట్‌ ఆఫ్‌ ధింగ్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు బెంగుళూరులోని బోచ్‌ కంపెనీ సీనియర్‌ ఇంజినీర్‌ ఉప్పల సుమంత్‌ తెలిపారు స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ అఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్ల్‌ విభాగ విద్యార్థులకు ఐఒటి ఇండిస్టీయల్‌ అప్లికేషన్స్‌పై మంగళవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక రంగంలో ఐఒటి అత్యంత ప్రాధాన్యత వహిస్తుందని తెలిపారు. ఇంటర్‌ నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇండిస్టీయల్‌ అప్లికేషన్స్‌లో ఐఒటి యెక్క ప్రాముఖ్యతను ప్రయోగ పూర్వకంగా విద్యార్థులకు విశదీకరించారు. ఆర్డినో నోడ్‌ యంసియు అప్లికేషన్స్‌పై విద్యార్థులు ప్రయోగాలు నిర్వహించారు ఇంటర్‌ నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కు నేడు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఐఒటి ఇండిస్టీయల్‌ అప్లికేషన్స్‌లో శిక్షణ పొందిన వారికి పలు బహుళజాతి కంపెనీలలో అత్యధిక వేతనాలతో పాటు డిమాండ్‌ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగం అధ్యాపకులు, బి టెక్‌ మూడో సంవత్సరం విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్‌ కె. జగదీశ్‌ బాబు, ఇసిఇ విభాగాధిపతి డి. రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️