స్విమ్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా అవగాహనా వారోత్సవాలు

తిరుపతి సిటీ : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ గ్లకోమా అవగాహనా వారోత్సవాలు (మార్చి 9వ నుండి 15 తేదీ వరకు) లో భాగంగా స్విమ్స్‌ ఎన్‌.ట్‌.ఆర్‌ నర్కిల్‌ నుండి వాల్మీకి నర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మ్యారథాన్‌ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్‌ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌.వి. కుమార్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్లకోమా అంటే నీటి కాసుల అని అర్ధం. ఇది కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్‌ నాడిని దెబ్బతీనే కంటి వ్యాధి, దీని వల్ల దృష్టి కోల్పోవడం, శాశ్వత అంధత్వం వంటివి ఏర్పడుతాయని పేర్కొన్నారు. గ్లకోమా వచ్చిన వారికి కంటిలోని ఒత్తిడి పెరుగుతుందని, దఅష్టిలోపం ఏర్పడుతుందని, అలాగే కంటి మూలంలోని పక్కకు మరియు బయట వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడుతుందని, ఇటువంటి లక్షణాలు కలిగినవారు వైద్యులను సంప్రదించి లేజర్‌ చికిత్స ట్రాబెక్యూలెక్టమీ, మైక్రోఇ న్వాసివ్‌ గ్లాకోమా సర్జర్‌ ద్వారా వూర్తిగా నయం చేసుకోవచ్చునని అలాగే 50సంపప ఉన్న ప్రతి ఒక్కరు గ్లకోమా పరీక్షలు చేసుకోవడం మంచిదని తెలియజేశారు. ఈ ర్యాలి స్విమ్స్‌ ఎన్‌.టి.ఆర్‌. సర్కిల్‌ నుండి వాల్మీకి సర్కిల్‌ వరకు గ్లకోమాను అరికట్టండి కంటి చూపును కాపాడుకోండి. గ్లకోమా వలన మీ జీవితాన్ని చీకటి మయం చేసుకోకండి, మీ కంటి చూపును హరించకముందో గ్లకోమాను అరికట్టండి. ఈ సంవత్సరం థీమ్‌ ఉంటింగ్‌ ఫర్‌ ఏ గ్లాకోమా ఫ్రీ వరల్డ్‌ అనే నినాదాలతో కోనసాగింది. ఈ కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌.ఎం.ఓ. డా కోటిరెడ్డి, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ నాగరాజు, అప్తమాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రభంజన్‌ కుమార్‌, జిల్లా వైద్యధికారి డాక్టర్‌ బాలక్రిష్ణనాయక్‌, స్విమ్స్‌ వైద్యులు డాక్టర్‌ శ్రీహరి, డాక్టర్‌ సింధూర, డాక్టర్‌ విద్య, డాక్టర్‌ వినీత, డాక్టర్‌ సాయిశిల్ప మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️