విశాఖలో ప్రపంచ హోమియోపతి డే వేడుకలు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రపంచ హౌమియోపతి వేడుకలను గురువారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌ హోమియో మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ అత్తిలి హైమావతి సభాధ్యక్షతన సిరిపురంలో ఆమె కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోడిస్ట్రిక్ట్‌ హోమియో మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి కొండపి యస్‌ వి గణేష్‌ బాబు మాట్లాడుతూ … హోమియోపతి పితామహుడు డాక్టర్‌ సామ్యూల్‌ హనేమాన్‌ జన్మదినాన్ని హోమియోపతి డే గా ఏప్రిల్‌ 10 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆయన హోమియో వైద్య విధానాన్ని కనిపెట్టడానికి ఎంతో శ్రమించారు అది సేఫ్‌ మెడిసిన్‌ గా ప్రూ అయినాక ప్రపంచానికి తెలియపరిచారని అన్నారు. ఇటువంటి వైద్య విధానానికి సంబంధించిన వ్యక్తులందరూ హనేమాన్‌ ఒక కారణజన్ముడని ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని వైద్య విధానాన్ని కనుక్కున్నారు తెలిపారు. ఆయన హోమియోపతి పితామహుడు అంతేకాకుండా ఇంగ్లీష్‌ వచ్చాన్ని అలోపతి గా కూడా ఆయనే నామకరణం చేశారని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ప్రముఖ వైద్యులు హోమియో వైద్యులు డాక్టర్‌ ఆకెళ్ళ సూర్యనారాయణ , ఏ వి ఆర్‌ మూర్తి , మాస్టర్‌ ఇ కే , డాక్టర్‌ గోవర్ధన్‌ డాక్టర్‌ డబ్బీరు గౌరీ శంకర్‌ , డాక్టర్‌ ఎంఆర్‌ఆర్‌ శర్మ , డాక్టర్‌ కె ఎస్‌ శాస్త్రి , డాక్టర్‌ కొండపి నాగేశ్వరరావు వంటి వారు విశాఖపట్నంలో ఉచిత వైద్య సేవ చేసి హోమియో వైద్యానికి వన్నె తెచ్చారని, ఈ సందర్భంగా వారిని స్మరించుకోవటం చాలా ఆనందదాయకం అని అన్నారు, ఈ కార్యక్రమంలో పివి రామయ్య , వివిఎన్టి మూర్తి , సురేఖ రేవతి , బివి సత్యనారాయణ రావు ,, బి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️