ప్రజాశక్తి -శ్రీశైలం : సున్నిపెంట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగము ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి.హుస్సేన్ భాష అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో ప్రభుత్వాలు కల్పిస్తున్న హక్కులను వినియోగించుకుని ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని తెలియజేశారు. రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి సురవరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి దేశంలో నేడు హక్కులను తమ రాజ్యాంగంలో పొందు పరిచి హక్కులను అమలు చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల ద్వారా హక్కులను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. ఎం. పద్మ, డాక్టర్. కే. రాజన్న,ఇందిరా ప్రియదర్శిని, బాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
