బాపట్లలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

బాపట్ల : నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా …. జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి ఎంఎల్‌ఎ నరేంద్ర వర్మ రాజు, జిల్లా వైద్య శాఖ అధికారి విజయమ్మ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ … అధిక జనాభా దేశ ప్రగతికి అవరోధమని దేశం అభివఅద్ధి చెందాలన్నా కుటుంబం అభివృద్ధి చెందాలన్నా జనాభా నియంత్రణ ముఖ్యమని అన్నారు. అధిక జనాభా పర్యావరణ వ్యవస్థకు మానవాళి పురోగతికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అధిక జనాభా పెరుగుదల వలన కలిగి నష్టాలపై అవగాహన పెంచుకోవాల్సిందిగా తెలియజేశారు.

➡️