ఏలూరు : గతంలో అంగన్వాడీల సమ్మె సందర్భంగా ప్రభుత్వానికి అంగన్వాడీ యూనియన్లకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని నేటి వరకు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ జేఏసీ కమిటీ లు ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు అనేకసార్లు సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయమని విన్నవించిన పెడచెవిన పెడుతూ ఒప్పందాలను పరిష్కరించనందుకు నిరసనగా అంగన్వాడీ జేఏసీ కమిటీలు ఈరోజు చలో విజయవాడకు శాంతియుత ధర్నాలకు పిలుపునిచ్చినందున అంగన్వాడీలను విజయవాడ వెళ్లకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వ నిర్బంధ కాండను ప్రయోగించి పోలీసు యంత్రాంగంచే నిలువురించే ప్రయత్నం చేసినందున చింతలపూడి అంగన్వాడీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి బోసు బమ్మ సెంటర్లో ప్రభుత్వ నిర్బంధకాండకు వ్యతిరేకంగా, సమ్మె కాలపు హామీలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారాకోకు సిఐటియు, ఎఐటియుసి సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తుర్లపాటి బాబు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో అంగన్వాడీలకు అమలు చేయవలసినటువంటి ప్రభుత్వ ఒప్పందాలు నేటికీ అమలు చేయక కూటమీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని హామీలు అమలకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడి కార్యకర్తలు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. సిపిఎం పార్టీ నాయకులు రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు 42 రోజుల సమ్మె సందర్బంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, కూటమి నాయకులు అంగన్వాడీల వద్దకు వచ్చి మీవి న్యాయమైన డిమాండ్లు అని మద్దతు తెలిపి వెళ్లి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమైన డిమాండ్లను నెరవేర్చక,శాంతియుత ధర్నా కు వెళుతున్న అంగన్వాడీ లపై నిర్భందకాండ ప్రయోగించడం కూటమి ప్రభుత్వం చేతకాని తనమని అన్నారు. రైతు సంఘం నాయకులు ఎస్‌కె.కాలేషా మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కోర్కెలు తీరుస్తామని వ్రాతపూర్వక ఒప్పందాలు అమలు చేయాలని లేనిచో బవిష్యత్ ల జరగబోయే వారి పోరాటాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె.గురవయ్య, సిఐటియు నాయకులు ఆర్.ధర్మారావు, హమాలీ నాయకులు శివ, చిన్నారావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
