ఎస్.ఎఫ్.ఐ, పి.డి.ఎస్ .యు ఆధ్వర్యంలో రాస్తారోకో

Dec 5,2024 16:02 #SFI

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : పట్టణంలోని విద్యానగర్ పాఠశాల ప్రహరీ గోడ కూలి చనిపోయిన చిన్నారి ఆస్తా మాహిన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎస్.ఎఫ్.ఐ, పి.డి.ఎస్. యు విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పట్టణంలోని పటేల్ సెంటర్ వరకు లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి హర్షవర్ధన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆది, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి హర్షవర్ధన్ మాట్లాడుతూ… పాఠశాల ప్రహరీ గోడ కూలి చిన్నారి ఆస్త మాహిన్ చనిపోవడం చాల బాధాకరం అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మండల విద్యాధికారి పై కేసును నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఆరోపించారు. ఈ విషయమై బుధవారం రాత్రి సంఘటనా స్థలానికి వచ్చిన డిఈఓ జనార్దన్ రెడ్డికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో బాధ్యులపై కేసు నమోదు చేయాలని, వారిని సస్పెండ్ చేయాలని వినతి పత్రం సమర్పించినా డీఈవో స్పందించకపోవడం దారుణం అని ఆరోపించారు. అలాగే బిల్డింగ్ కాంట్రాక్టర్ ను, ఇంజనీర్ ను సైతం ఈ ఘటనకు బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. మృతి చెందిన చిన్నారి మా హిన్ కుటుంబానికి రూ 30 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దిలీప్, పిడిఎస్ యు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్ గణేష్ జగదీష్ శ్యాం నాయక్ యుగంధర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

➡️