సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

Jan 7,2025 16:28 #nandhyala, #rastaroko, #vizag

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : నరేంద్ర మోడీ 8 తేదీ పర్యటనను నిరసిస్తూ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం టి గోపాలకృష్ణ అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్, ఎం కర్ణ మాట్లాడుతూ.. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర 7 జిల్లాలకు ప్రతి సంవత్సరం జిల్లాకు రూ 50 కోట్లు కేటాయిస్తామని, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తామని పార్లమెంటులో హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోడీ అమరావతికి వచ్చిన సందర్భంగా తిరుపతిలో సభ ఏర్పాటు సందర్భంగా చంద్రబాబు సమక్షంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ ఈనెల 8 వ తేదీన విశాఖపట్నం రావడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వారు కోరారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం పదివేల ఎకరాల భూములను తీసుకోవడం జరిగిందని 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. 2014లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2023 లో నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు అని ఇంతవరకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని వారు ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం జరిగితే రాయలసీమ జిల్లాలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వారు తెలిపారు. ఈనెల ఎనిమిదో తేదీన నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చే సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో రాస్తారో కు ఒక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులు మరెన్నో ,ఎస్ ఉస్మాన్ భాష, సలాం ఖాన్ ,రంగమ్మ , ఉషనమ్మ , సాజిదాబి, జయ రాణి ,వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, బోయ మధు, రామకృష్ణ, ఆంజనేయులు ,రాము, బాలస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️