ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత అధి కంగా పెరిగిపోతుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చలి, మంచు తీవ్రత బాగా పెరిగింది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా కూడా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం పొగమంచుతో పూర్తిగా కమ్ముతోంది. చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజల వణికి పోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉదయం 6 గంటలకు 15 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రత తగ్గిపోతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు బయటకు రావాలంటే ఉనికి పోతున్నాను. చిన్న పిల్లలు, వద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసు కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.పొగ మంచుతో ఇబ్బందులు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు పొగమంచు ఎక్కువుగా ఉండడంతో తెల్లవారు జాము నుంచి వాహనదారులు రోడ్‌పైకి రావాలంటే భయపడుతున్నారు. చిరు వ్యాపారులు సొంత గ్రామాల నుండి వివిధ వ్యాపారాల, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగస్తులు మండల, మున్సిపల్ కేంద్రాలకు నిత్యం రాకపోకలు సాగి స్తుంటారు. సైకిళ్లు, మోటారు వాహనాలపై రావాల్సి వస్తుండడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పలువురు చెబు తున్నారు. మంచుకు ద్విచక్ర వాహనదారులు, పెద్ద వాహనాలు నడపటం డ్రైవర్లకు ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో పొగమంచు వల్ల తరచూ ప్రమా దాలు కూడా అవుతున్నాయి. ఇటీవల కాలంలో సుండుపల్లె నుంచి రాయచోటికి ద్విచక్ర వాహ నంలో వస్తుండగా పొగ మంచుతో రోడ్డుపైన అదు పు తప్పి కింద పడి ప్రమాదంలో తీవ్రంగా గాయ పడడం జరిగింది. పొగ మంచు ఎక్కువగా ఉండ టం గుంతలు ఎక్కడున్నాయో కూడా కనిపించక వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు.ఉన్ని దుస్తులకు గిరాకీ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉండే దుస్తులకు భారీగా గిరాకీ పెరిగింది. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో ఎక్కు వగా ఉన్ని దుస్తులు అమ్మకాదారులు పెద్ద సంఖ్యలో వ్యాపారాలు సాగిస్తున్నారు. చలిని దష్టిలో ఉంచుకొని స్వెటర్లు, తలకు టోపీలు పలువురు వాటిని కొను గోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.రోగులు జాగ్రత్త దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చలికి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. చలి వల్ల ఊపిరితిత్తులు కొంత ఆయాసానికి గురవుతాయి, చర్మం పగుళ్లు బారడం జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చిన్న పిల్లలు చలిగాలి సోకకుండా స్వెటర్లు, మెత్తని రగ్గులు వాడాలని నిపుణులు చెబుతున్నారు.అప్రమత్తంగా ఉండాలి చిన్న పిల్లలు, వద్దులు శీతాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్ని దుస్తులు ధరించి, వేడి నీళ్ళును తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి చల్లని వస్తువులు తీసుకోకుండా పెద్దాపురం జాగ్రత్తలు పాటించాలి.- ఎన్.కొండయ్య డిఎంహెచ్‌ఒ, రాయచోటి.