ప్రజాశక్తి-విజయనగరం కోట : మండలంలో ప్రారంభమైన మినీ గోకులాలు, శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 12 వేల గోకులాలను ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విజయనగరం మండలంలో రాకూడు గ్రామంలో 2,30,000 వ్యయంతో నిర్మించిన ఆరు పశువుల గోసాలలను ప్రారంభించిన స్థానిక ఎంపీటీసీ వేచలపు శ్రీనివాసరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పాలవలస యశస్విని. ఈ కార్యక్రమంలో విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, ఎంపీటీసీ రాజేష్ బాబు, మాజీ సర్పంచ్ జీ రామసత్యం మాజీ ఉపసర్పంచ్ వి రామసత్యం పార్టీ అధ్యక్షులు జి. ప్రసాదరావు గోసాల యాజమాని పొటిపి రెడ్డి రమణ, ముందుగా గోశాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం గోవును గోసాలలో కట్టి దానికి అరటిపల్లును తినిపించి నమస్కారం చేశారు. అక్కడినుంచి కోరుకొండ పాలెం గ్రామంలో మరో గోశాలను అదేవిధంగా గుండాలపేట గ్రామంలో మరో ఆరు పశువుల గోసాలను ప్రారంభించడం జరిగింది.