వైసిపిది దుర్మార్గ పాలన

Apr 17,2024 21:47

 ప్రజాశక్తి – వంగర  : వైసిపిది దుర్మార్గమైన పాలనని మాజీ మంత్రి, రాజాం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మండల కేంద్రంలో మండల నాయకులు ముఖ్య కార్యకర్తలతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజా సేవంటే ఎంతో ఇష్టమన్నారు. వైసిపి పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు.టిడిపిలో పలువురు చేరిక మండలంలోని జగన్నాథవలస గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. వీరికి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బొత్స వాసుదేవరావు నాయుడు, పిన్నింటి మోహనరావు, ఉదయాన మురళీకృష్ణ రావు, లచ్చు బుక్త కృష్ణమూర్తి, పైల వెంకటరమణ, ఎం గణపతి, సిహెచ్‌ గంగులు తదితరులు పాల్గొన్నారు.

లలిత కుమారి ఇంటింటా ప్రచారం

వేపాడ : మండలంలోని కొత్త సింగరాయి, జగ్గయ్యపేట, గుడివాడ, ఆకుల సీతంపేట గ్రామాల్లో ఎస్‌.కోట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనకు, ఎమ్‌పిగా భరత్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించుకోవాలని లేని పక్షంలో మన ఆస్తులతో పాటు కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిన నేపథ్యంలో విజన్‌ కలిగిన జన నాయకుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. గొంప కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేసి టిడిపి విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, ఉపాధ్యక్షుడు పి.వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి కె.రమణమూర్తి, మండల ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్‌, రాష్ట్ర ఎస్‌టి సెల్‌ కార్యవర్గ సభ్యురాలు దాసరి లక్ష్మి, మంచిన అప్పలసూరి, సిరికి జగన్నాథం, ఎన్‌. ముత్యాలనాయుడు, బిజెపి సీనియర్‌ నాయకులు గోకాడ మహేష్‌, జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

టిడిపిలోకి ఎమ్మార్‌నగరం సర్పంచ్‌

పార్వతీపురంరూరల్‌ : మండంలోని ఎమ్మార్‌ నగరం సర్పంచ్‌ వంగపండు లక్ష్మి, వైస్‌ సర్పంచ్‌ వంగపండు త్రినాథరావు వైసిపిని వీడి బుధవారం టిడిపిలో చేరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజరు చంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఎమ్మార్‌ నగరం గ్రామానికి చెందిన 300 కుటుంబాలు టిడిపిలో చేరాయి. సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు 300 కుటుంబాలు టిడిపిలో చేరాయి.వైసిపి నుండి టిడిపిలో చేరికచీపురుపల్లి : చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ నుండి పలువురు వైసిపి నుండి టిడిపిలో చేరారు. బుధవారం చీపురుపల్లి పంచాయతీ 13 వార్డు మెంబరు మీసాల కామేశ్వరి, ఆమె భర్త మీసాల శ్రీనివాసరావులతో పాటు 14వ వార్డు మాజీ మెంబరు రెడ్డి త్రినాధ, వైసిపి కార్యకర్తలు రెడ్డి అసిరినాయుడు, రెడ్డి లక్ష్మణ, రెడ్డి మన్మధరావు, బెవర బానుచందర్‌, వెంకటరమణ, రెల్లి అప్పారావు, గెరిడి కామరాజు కుంటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. వీరికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, టిడిపి మండల అద్యక్షుడు రౌతు కామునాయుడు, ఆర్‌ఇసియస్‌ మాజీ ఛైర్మన్‌ దన్నాన రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు టిడిపిలోకి ‘తాడ్డి చంద్రశేఖర్‌’

మెరకముడిదాం: మాజీ ఎంపిపి కీర్తిశేషులు తాడ్డి కృష్ణారావు కుమారుడు తాడ్డి చంద్రశేఖర్‌ గురువారం టిడిపిలోకి చేరనున్నారు. ఆ రోజు సాయంత్రం గర్భాం రామమందిరం వద్ద జరగనున్న టిడిపి సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు సమక్షంలో ఆయన పసుపు కండువా వేసుకోనున్నారు.

➡️