వైసిపి గెలుపు ఖాయం

మాట్లాడుతున్న వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు

ప్రజాశక్తి-అనకాపల్లి

13న జరిగిన ఎన్నికల్లో వైసిపి 123 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో విజయ దుందుభి మోగించనున్నదని, మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పేర్కొన్నారు. స్థానిక రింగ్‌ రోడ్డులో వున్న పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ఓటు కోసం సరైన అవగాహన లేక పోలింగ్‌ స్టేషన్‌ల చుట్టూ తిరిగే వారని, ఈ సారి సచివాలయ సిబ్బంది పుణ్యమా అని ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్‌లు అందాయని, వారి సేవలతో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. తెల్లవారక ముందే తమ ఇంటి వద్దే పింఛన్లు అందుకుంటున్న ప్రతి పింఛనుదారుడు ఉదయం ఆరు గంటలకే పోలింగ్‌ స్టేషన్‌లకు వచ్చి ప్యాన్‌ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్‌రెడ్డి రుణం తీర్చుకున్నారని చెప్పారు. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దితున్న జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపు కోసం ప్రతి మహిళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఆదిపత్యంతో స్థానిక అధికార పార్టీ నాయకుల మధ్య కొంత ఇబ్బందులు వచ్చిన, ప్రజలు అవేమి పట్టించుకోకుండా జగన్‌కే ఓటు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడువాకుల నారాయణరావు, రాపేటి మహాలక్ష్మి నాయుడు, పి.కృష్ణపరమాత్మ, సత్యన్నారాయణ, బుజ్జి పాల్గొన్నారు.

➡️