నెల్లూరు రూరల్ : నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 31వ డివిజన్, టైలర్స్ కాలనీకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ముస్లిం మైనార్టీ కార్యదర్శి నాయబ్ రసూల్, మరికొందరు కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలసి పనిచేద్దాం. అందరికి ఆహ్వానం పలుకుతున్నా రండి. అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. తనకు ఓటు వేయనివారు, తనకు వ్యతిరేకంగా చేసినవాళ్లకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే స్వేచ్ఛగా రావచ్చునని అన్నారు. తన చేతిలో ఉంటే చేసేదానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మన్నేపల్లి రఘు, టీడీపీ నాయకులు పల్నాటి మస్తాన్ నాయుడు, ఖాదర్ భాషా టి.వి.ఎస్. కమల్, రెహ్మాత్, సతీష్, కమాలుద్దీన్, సత్తాజ్, మస్తాన్, ఖాజా, హనీఫ్, కరీమ, తదితరులు పాల్గొన్నారు.