ఏడిదలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : 2029లో అధికారం చేపట్టడమే ఏకైక లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టించి పని చేయాలని ఏడిద సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం, జడ్పీటీసీ కురుపూడి భవాని రాంబాబు, వైస్‌ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైసీపీ గ్రామ అధ్యక్షుడు పలివెల సుధాకర్‌ ఆధ్వర్యంలోబుధవారం జరిగిన 15వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత గ్రామం లోని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే పార్టీ నాయకులతో కలిసి సుధాకర్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పట్నాల నాగబాబు, తాతపూడి ఉషా రాజేష్‌, చొల్లంగి రామారావు, రామిశెట్టి శ్రీహరిబాబు, వాసిరెడ్డి అర్జున్‌, కొండేటి కాళీ కఅష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️