ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకుని అభిమానాన్ని చూపుతున్నారని, పార్టీకి కార్యకర్తలే పునాదిగా నిలబడి ప్రజా సేవలో ముందుకు నడిపిస్తున్నారని మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లి ప్రధాన సెంటర్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సింహాద్రి రమేష్ బాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లపల్లి మండల యువజన అధ్యక్షులు వెనిగళ్ళ తారక జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి తినిపించి తన ఆప్యాయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ సీరం వెంకట సత్యనారాయణ(నాని), ఎంపీటీసీ సభ్యులు మోపిదేవి ద్వారకానాథ్, పార్టీ నాయకులు మత్తి రాంబాబు, పాగోలు నాగ సీతారామరావు (ఫణి), ఎస్సీ సెల్ నాయకులు జుజ్జువరపు భాగ్య రావు, మద్దాల వీరాస్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మేరుగ రమేష్, మైనారిటీ సెల్ నాయకులు హర్షద్, వీరబాబు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
