దుబారు లో ఘనంగా వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి – కడప : వైసీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ సభ్యులందరూ కలిసి కరామా ఏరియాలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్‌ అక్రమ్‌ మాట్లాడుతూ … వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజా సంక్షేమం కొరకు పని చేసే పార్టీ అని అన్నారు. మా అధి నాయకులు వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి సారధ్యంలో నడుస్తున్న పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.ఈ సందర్భంగా 50 మందికి పండ్లు పంపిణీ చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూఏఈ దుబారు ఎన్‌ఆర్‌ఐ సభ్యులు చక్రి, ప్రేమ్‌ అన్నా, ఫయీం బారు, అజీజ్‌, అబ్దుల్లా, ఇర్షాద్‌ బారు, అనిల్‌, విజరు, రఫీక్‌, బాల యేసు, జోగయ్య, రాము, రమేష్‌, శ్రీను, భాస్కర్‌, చిన్నా, గ్రాబ్రేల్‌, జాన్స్‌ సన్‌, సతీష్‌, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా, భారీగా వై.యస్‌.ఆర్‌. కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.

➡️