ప్రజాశక్తి-రామభద్రపురం : మండలంలోని బూసాయవలస గ్రామానికి చెందిన యువ పాటల రచయిత రాం పైడిశెట్టి (42) అకస్మాత్తుగా హైదరాబాదు లో మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చంటి, సితార, కలెక్టర్ గారి భార్య, నందీశ్వరుడు తదితర సుమారు 20 సినిమాలకు పాటల రచయితగా పైడిశెట్టి పనిచేసారు. ఒకచిన్న కుగ్రామానికి చెందిన ఈయన చిన్నతనంలోనే హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ పాటల రచయితగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. ప్రముఖ గాయనీ మణులు చిత్ర, శైలజ తదితరులతో ఈయన పనిచేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ గాయకుడు ఆకస్మికంగా మతిచెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి ఇదే గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతినాయుడు సంతాపం తెలిపారు.