యువత ను క్రీడా పోటీల్లో ప్రోత్సహించాలి

Jan 9,2025 17:51 #Kakinada, #Sports

ప్రజాశక్తి – పెద్దాపురం : యువతను వివిధ క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహారాణి కళాశాలలో గురువారం నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డి.ఎస్.పి శ్రీహరి రాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక దారుఢ్యం తో పాటు మానసిక వికాసం సిద్ధిస్తుందన్నారు. క్రీడా పోటీలు ముగిసిన అనంతరం సాయంత్రం సీఐ టి క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో కుడా చైర్మన్ తుమ్మల బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సంక్రాంతి పర్వదినాలలో యువతను క్రీడా పోటీల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పెద్దాపురం మండల పరిధిలోని ఆర్.బి పట్టణం, కట్టమూరు, కాండ్రకోట, వడ్లమూరు, చదలాడ, చంద్రమాంపల్లి,లూధరన్ హై స్కూల్స్ విద్యార్థులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు.ఈ పోటీల్లో కట్టమూరు టీం విన్నర్స్ గా, ఆర్ బి పట్నం టీం రన్నర్స్ గా, కాండ్రకోట టీం తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. విజేతలందరికీ తుమ్మల బాబు చేతుల మీదుగా నగదు, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఎస్సై వి మౌనిక ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీల నిర్వహణలో ఫిజికల్ డైరెక్టర్ లు జీ వరసాదనం, కే సుబ్రహ్మణ్యేశ్వర రావు, యు ఉమామహేశ్వరరావు, శేఖర్ బాబు, విశ్వేశ్వరరావు, దేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️