క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలి

Jun 8,2024 23:48 #andiboyina, #Power lifting
Power Lifting, andiboyina

ప్రజాశక్తి -గాజువాక : క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలని హైకోర్టు న్యాయవాది అండిబోయిన లక్ష్మి సూచించారు. ఫోర్త్‌ ఎపి స్టేట్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2024, సిక్స్త్‌ ఏపీ స్టేట్‌ బెంచ్‌ ఫ్రెష్‌ ఛాంపియన్‌షిప్‌ -2024 పోటీలను హెచ్‌బి కాలనీ సిడబ్ల్యుసిలో శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ నెల 8, 9 తేదీలలో సిడబ్ల్యుసి హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌, మాస్టర్‌ కేటగిరీ తదితర విభాగాలలో పాల్గొంటారని చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామన్నారు. స్టేట్‌ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను నేషనల్‌ పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు, పేర్ల సత్యారావు, కోదండరావు, వి.అప్పారావు, సిహెచ్‌ అప్పలరాజు, రాంబాబు, శ్రీను, రామలక్ష్మి, విజయలక్ష్మి, రమేష్‌, సత్యనారాయణ, జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️