యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి – ఎక్సైజ్ సీఐ మల్లిక

Nov 29,2024 17:37 #annamayya, #rayachoti

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక అన్నారు. శుక్రవారం అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ సీఐ మల్లికా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాదొకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతాయని అన్నారు. యువత మాదక ద్రవ్యాల ప్రభావానికి గురికాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలందరి సహకారంతో పోరాడితేనే మాలక ద్రవ్యాల వినియోగం నివారించవచ్చునని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.ఎం.వి నారాయణ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ సామాజిక బాధ్యతను గుర్తుచేసుకొని దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఓబులపతి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ-విద్యార్థులు పాల్గొన్నారు.

➡️