ప్రజాశక్తి-జగ్గంపేట (కాకినాడ) : జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా యడ్ల రామకృష్ణ శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కాకినాడ సర్పవరం నుంచి జగంపేట బదిలీ గా వచ్చారు. జగ్గంపేట సిఐగా లక్ష్మణరావు వి ఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ కు పోలీస్ సిబ్బంది, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఎస్సై లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను తన నివాసమైన ఇర్రిపాక గ్రామం లో మర్యాద పూర్వకం గా కలిశారు.