వై.ఎస్‌ అభిషేక్‌ రెడ్డి మృతి

ప్రజాశక్తి – పులివెందుల రూరల్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బంధువు, వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి మనుమడు, వై.ఎస్‌. మదన్మోహన్‌ రెడ్డి తనయుడు డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి అనారోగ్య కారణంగా శుక్రవారం మతి చెందారు. ఈయన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో కొన్ని నెలల కొందట చికిత్స పొందుతూ ఉన్నారు. వైసిపి వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లింగాల మండల వైసిపి ఇన్‌ఛార్జి పార్టీ బాధ్యతలు తీసుకొని ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో హైదరాబాదులో ఒక ప్రయివేట్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈయన డాక్టర్‌ విద్య పూర్తి చేసి విశాఖపట్నంలో తన సతీమణితో కలిసి ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేశారు. ఆయనుకు ఇద్దరు కుమార్తెలున్నారు. అభిషేక్‌ రెడ్డి మరణి ంచడంతో వైఎస్‌ఆర్‌ కుటుంబం తోపాటు, వైసిపి శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయంగా తన శైలిలో అందరి మదిలో మంచి చోటు సంపాదించుకున్నారు. ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పిన వెంటనే స్పందించేవారు. శుక్రవారం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాదులో ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు ఆయన భౌతికాయాన్ని పులివెందులలోని ఆయన స్వగహానికి తీసుకురానున్నారు శనివారం ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.

➡️