నాలుగురోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్‌.జగన్‌

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ (కడప) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కడప జిల్లా లో పర్యటించనున్నారు. 24 వ తేదీ న ఇడుపులపాయ ఎస్టేట్‌ కు చేరుకొని వైయస్‌ సభ్యులతోనూ, వైసిపి నాయకులతో చర్చించనున్నారు. 25 తేదీన పులివెందుల సిఎస్‌ఐ చర్చ్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని తర్వాత లింగాల మండలం తాతిరెడ్డిపల్లి సీతారామ దేవస్థానం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. 26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. 27 వ తేదీన ఉదయం విజయవాడ కు ప్రయాణమవుతారు.

➡️