జనసేనలోకి వైసిపి నేతలు

Nov 28,2024 16:48 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : చెముడులంకకు చెందిన మాజీ ఎంపీటీసీ, జనసేన నేత నాగిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక వైసిపి పార్టీకి రాజీనామా చేసి గురువారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన నేత శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ అతి త్వరలో జన సునామీని సృష్టించబోతుందన్నారు. రాష్ట్రంలో వైసిపి నుంచి జనసేనలోకి భారీ చేరికలతో ఆ పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అడబాల వీర్రాజు, అడబాల మాచరయ్య(చిన్న), తమ్మన ఏసు, పామర్తి పేరయ్య, అడబాల శ్రీనివాసు, నాగిరెడ్డి శ్రీనివాస్, అడబాల సూర్యనారాయణ, తిర్నాతి శ్రీనివాస్, మద్దిరెడ్డి వెంకన్న బాబు, అడబాల ధర్మయ్య, పేరపు చిన్న,
అడబాల ఆదినారాయణ, పామర్తి ఆదినారాయణ, చిన్న వెంకయ్య, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️