ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చెముడులంక శ్రీకఅష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జనసేన నేత నాగిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో పంచాయితీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తో సహా ఆరుగురు వార్డు నెంబర్స్ తో పాటుగా సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు స్థానిక వైసిపి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన నేత శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ అతి త్వరలో జన సునామీని సృష్టించబోతుందన్నారు. రాష్ట్రంలో వైసిపి నుంచి జనసేనలోకి భారీ చేరికలతో ఆ పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీలోనికి రావడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారని కానీ అన్ని ఆలోచించాకే పార్టీలో చేర్చుకోవాలని ఆలోచనతో ఇంతకాలం నిరీక్షించామన్నారు. ఇప్పుడు సమయం వచ్చిందని ఇకపై వేట మొదలవుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారద్యంలో దశలవారీగా అమలు చేస్తూ విజయవంతంగా ముందుకు వెళుతోందని బండారు శ్రీనివాస్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును పొందారన్నారు. పవన్ కళ్యాణ్ సారద్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పనిచేయడానికి ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో చెముడులంక నుంచి చేరికలకు శ్రీకారం చుట్టామని, ఇకపై అన్ని ప్రాంతాల నుండి భారీగా చేరికలు ఉంటాయని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, జిల్లా కార్యదర్శి బక్కా ఆదినారాయణ, సలాది జయప్రకాష్, కొత్తపల్లి నగేష్, పడాల అమ్మిరాజు, బావిశెట్టి తాతాజి, నాగిరెడ్డి మహేష్ , చింతలపూడి శ్రీనివాసు, తమ్మన ఏసు, నాగిరెడ్డి శ్రీను, గారపాటి శ్రీనివాసు జన సైనికులు, కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.