ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా … మండల కేంద్రమైన గుడ్లవల్లేరు వైయస్సార్ బ్రిడ్జిపై మండల వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కోటప్రోలు నాగు , కొడాలి సురేష్ , మట్ట కమల , పిన్నమనేని రాఘవేంద్రరావు , గుదే రవి , జాన్ బెన్నీ , కొడాలి సుధాకర్ , స్వాతి సాయి , గిరదా లక్ష్మీ , కొడాలి శివ , మహమ్మద్ బాజీ , తదితర నాయకులు పాల్గొన్నారు.
