ప్రజాశక్తి- క్రిష్ణగిరి (కర్నూలు) : క్రిష్ణగిరి మండల కేంద్రమైన ఎస్ హెచ్ ఎర్రగుడి గ్రామానికి చెందిన వై.రాజశేఖర్ రెడ్డి వైఎస్‌ఆర్సిపి పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా ఎంపికైన సందర్భంగా సోమవారం పత్తికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవమ్మను వైఎస్‌ఆర్సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డిని, క్రిష్ణగిరి మండల అధ్యక్షుడు కంగాటి వెంకటరామరెడ్డిని, కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్సిపి అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డిని కలిసి కఅతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ పార్టీ కోసం పని చేస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అనంతరం వైఎస్‌ఆర్సిపి పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా ఎన్నికైన వై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్సిపి పార్టీ పదవి ఇచ్చినందుకు ఎల్లవేళలా పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీని బలేపేతం చేసుకుంటూ ముందుకు పోతానని తెలిపారు.
