వైఎస్‌ఆర్‌టియుసి నేత మస్తానప్ప మృతి

Ysrtuc leader Masthanappa died

ప్రజాశక్తి -ఉక్కునగరం : స్టీల్‌ వైఎస్‌ఆర్‌టియుసి ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప శనివారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ఉక్కునగరంలోని వైఎస్‌ఆర్‌టియుసి కార్యాలయం వద్ద సంతాప సభను ఏర్పాటు చేశారు. మస్తానప్ప బౌతికకాయాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన పోరాటం కీలకంగా జరుగుతున్న సమయంలో సీనియర్‌ నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మస్తానప్ప కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కడప ప్రాంతానికి చెందిన మస్తానప్ప ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం ఉక్కునగరంలో నివాసముంటున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ వైఎస్‌ఆర్‌టియుసి, వైసిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కార్మికులకు శాఖా పరమైన ఇబ్బందులు తలెత్తితే అధికారులతో మాట్లాడి పరిష్కరించేవారు. మంచి వ్యక్తి మృతి అత్యంత బాధాకరమని కార్మిక నేతలు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరాం, ఐఎన్‌టియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, వివిధ విభాగాల నుంచి సీనియర్‌ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

➡️