ప్రజాశక్తి-కడప అర్బన్ : వాణిజ్యపరంగా లభించే సాధారణ ప్రారంభ పదార్థాలు, పర్యావరణ అనుకూల సింథటిక్ పద్ధతులను ఉపయోగించి అధునాతన ఔషధాలను కనుగొన్న వైవీయూ పీజీ కళాశాల రసాయన శాస్త్ర శాఖ స్కాలర్ కె.యలమందరావుకు యోగి వేమన విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. రసాయన శాస్త్ర విభాగ ఆచార్యులు ఎ.జి.దాము పర్యవేక్షణలో ” డెవలప్మెంట్ ఆఫ్ క్వినజోలినోన్ బేస్డ్ మాలిక్యులర్ హైబ్రిడ్స్ యాజ్ ఇన్నవేటివ్ మల్టీ టార్గెట్ డైరెక్టెడ్ లిగాండ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్ ” అనే అంశంపై పరిశోధన చేసిన సిద్ధాంత గ్రంథం విశ్వవిద్యాలయానికి సమర్పించారు. శుక్రవారం కె.యలమందరావుకు డాక్టరేట్ సర్టిఫికెట్ ను వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కెఎస్వీ కఅష్ణారావు జారీ చేశారు. యలమందరావు పరిశోధన అంశంపై పలు ప్రఖ్యాత అంతర్జాతీయ పబ్లికేషన్స్ అమెరికన్ కెమికల్ సొసైటీ,ఎల్సి వేర్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్వంటి అంతర్జాతీయ జర్నల్స్ లో 13 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. 20 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ (ఎన్.ఎఫ్. ఎస్.టి) ఫెలోషిప్ ను పొందారు. వైవీయూ రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ అందుకున్న యలమందరావు ను పరిశోధన గైడ్ ఆచార్య ఎ.జి.దాము ను విసి ఆచార్య కె. కఅష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పి పద్మ , ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథ్ రెడ్డి, రసాయన శాస్త్ర అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.