ప్రజాశక్తి -రాప్తాడు (అనంతపురం) : జిల్లా కేంద్రానికి కూత వేట దూరం లోని రాప్తాడు మండలం కేంద్రం లోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం సోమవారం ఉదయం 11 గంటలు అయినా తెరుచుకోని పరిస్థితి ఉంది. సోమవారం కావడంతో రైతులు తమ సమస్యలు చెబుకుందామని వ్యవసాయ అధికారి కార్యాలయం కు వస్తే 11 గంటలు అయినా తెరుచుకోని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు యూనిక్ ఐడి నెంబర్ తీసుకోమని చెబుతుంది. మరో వైపు రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లు కోసం దరఖాస్తు చేసుకోమని చెబుతున్నా రైతుసేవా కేంద్రముకు వెళితే సర్వర్ సమస్యలు చెబుతున్నారు. మండల కేంద్రములోని వ్యవసాయ అధికారి కార్యాలయం కు వస్తే అధికారి గానీ, సిబ్బంది కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్త ము చేస్తున్నారు. గతం లో ఉన్న వ్యవసాయ అధికారి కూడా సరిగా విధులుకు రావడం లేదని రైతులు నుంచి పిర్యాదులు స్థానిక ప్రజాప్రతి నిది మరియు రైతులు నుంచి వెళ్లడం కొత్త అధికారిని నియమించారు. అయినా మార్పు రాని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరం లోని రాప్తాడు మండలంలో ఇలాంటి పరిస్థితి రైతులు ఎదుర్కొంటే జిల్లా లోని ఇతర మండలాల్లో వ్యవసాయ అధికారులు పనితీరును అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
