మొక్కుబడిగా జడ్‌పి స్టాండింగ్‌ కమిటీ సమావేశం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు మొక్కుబడిని తలపిం చాయి. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ హాలు, డిపిఆర్‌సి హాలుల్లో జడ్‌పి సిఇఒ సి.ఓబులమ్మ, డిప్యూటీ సిఇఒ మైథిలి అధ్యక్షతన నిర్వహించారు. మొదటగా పోరుమామిళ్ల జడ్‌పిటిసి చెన్నయ్య జిల్లాలో పంచాయతీ రాజ్‌ రహ దారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రతి సమావేశంలో ప్రస్తావనకు వస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరాలసిస్‌ తదితర బెడెడ్‌ రోగుల పింఛన్లపై సర్వే ఉద్దేశం ఏమిటో తెలియ జేయాలని నిలదీశారు. పెరాలసిస్‌ రోగులు ప్రారంభదశలో మెరుగైన వైద్యం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడి ఉంటుందని, అటువంటి రోగుల పింఛన్‌ ఇప్పుడు తొలగించడం ఏమిటని నిలదీశారు. జిల్లాలో వేలాది మంది పింఛన్ల తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. డిఆర్‌డిఎ పీడీ స్పందిస్తూ రాష్ట్రంలో 15 వేల వరకు బెడెడ్‌ రోగులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, ఆమేరకు జిల్లా లోనూ బెడెడ్‌ రోగులపై సర్వే మాత్రమే చేపట్టాలని ఆదేశించిందని, బెడెడ్‌ రోగుల ఆరోగ్యం మెరుగుపడి ఉంటే వైద్య నిపుణుల సిఫారసు మేరకు వ్యాధి తీవ్రత ఆధారంగా వైద్యులు ఇచ్చే సిఫారసుల ఆధారంగా పింఛన్‌ తగ్గించడమా, తొలగించడమా అనేది ఉంటుందని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు జిల్లాలో 3,400 అక్రమ పింఛన్‌లపై విచారణ చేపట్టామని తెలి పారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వారికి డిజేబుల్‌ పింఛన్లు ఉన్నట్లు గుర్తిం చామని, అటువంటి పింఛన్లు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని తెలి పారు. ప్రభుత్వం అక్రమ పింఛన్ల తొలగింపుపై ఎనిమిది మంది మత్రులతో కమిటీ వేసిందని, కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు ఉండే అవకాశం ఉం టుందని తెలిపారు. ఖాజీపేటకు చెందిన జడ్‌పి కో-ఆప్షన్‌ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా శ్మశానాలను అభివృద్ధి పరచాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌డబ్య్లుఎస్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం వేసవి సీజన్‌ రానున్న నేపథ్యంలో సిపిడబ్య్లు స్కీముల పనితీరు మెరుగు పరచాలని జడ్‌పి సిఇఒ సి.ఓబులమ్మ ఆదేశించారు. జడ్‌పి సమావేశ హాలు సమావేశానికి హాజరు కావాల్సిన ముగ్గురు జడ్‌పిటిసిలు గైర్హాజరయ్యారు. డిపిఇఆర్‌సి సమావేశానికి పలువురు జడ్‌పిటిసిలు గైర్హాజర్‌ కావడంతో కొంతసేపు నిరీక్షించడం గమ నార్హం. ఏదేమైనా కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు జడ్‌పిటిసిలు, జిల్లా ఉన్నతాధికారులు హాజరై మొక్కుబడిగా సమావేశం గమనార్హం.

➡️